ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. హ్యాపీగా షికార్లకు తీసుకెళ్లాడు. పెళ్ళికి ముహూర్తం పెట్టాను రమన్నాడు. ప్రేమ మైకంలో అతని వెంటనే ఆ బాలిక వెళ్ళింది. కోరిక తీర్చమంటే తప్పని వారించింది. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చివరకు మానవమృగం చేతిలో బాలిక దారుణంగా హత్యకు గురైంది. గండిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కూరగాయల వ్యాపారి కుమార్తె అమీనా(14). ఫలక్‌నుమా ప్రభుత్వ బాలిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి కోసం తరచూ ఇంటికి వచ్చే అక్బర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ బైక్‌పై తిప్పేవాడు. సరదాగా తిప్పుతూ కావాల్సినవి కొనిస్తూ స్నేహం పెంచుకున్నాడు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.
బుర్కాను చింపి చేతులు కట్టేశాడు. మాట వినలేదనే కసితో తనవెంట తీసుకెళ్లిన కత్తితో బాలిక గొంతు కోశాడు. చనిపోయిందని భావించి వెళ్లిపోబోతుండగా.. కేకలు వేసింది. భయపడిన అక్బర్ బాలిక ముఖంపై బండరాయితో మోది హతమార్చాడు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద డబ్బును స్వాధీనం చేసుకున్నారు.