సోషల్ మీడియాలో ఫన్‌మోజీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో ఫన్‌మోజీ నుంచి వచ్చే కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.