మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఠాగూర్

సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (17:55 IST)
హీరోయిన్ సమంతతో విడాకుల అంశంపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనాలతో పాటు మీడియాకు ఒక ఎంటర్‌టైన్మెంట్ అంశంగా మారింపోయిందంటూ కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగతంగా, ఏకపక్షంగా విడాకులు తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు. 
 
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'తండేల్'. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అర్జున్ సమర్పణలో, బన్నీవాసు నిర్మించారు. ఈ నెల 7వ తేదీన విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో దూసుకునిపోతుంది. వాణిజ్యపరంగా కూడా భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఈ చిత్రం సక్సెస్ టూర్‌లో భాగంగా, నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు. 
 
మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎంటర్‌టైన్మెంట్‌గా మారిందన్నారు. మేము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రిలేషన్‌షిప్ బ్రేక్ చేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించామని చెప్పారు. తానుకూడా ఒక బ్రోకేన్ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టు చెప్పారు. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసున్నారు. నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద మీ లైఫ్‌పై మీద పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. 

 

సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

మా విడుకల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది

మేము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నాం

రేలేషన్షిప్ బ్రేక్ చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించాను

నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను

విడిపోతే ఆ బాధ… pic.twitter.com/ePhuq0pqTW

— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు