ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రోజులు

శుక్రవారం, 4 మార్చి 2022 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేటికి (శుక్రవారం) వెయ్యి రోజులుపూర్తయింది. వైకాపా అధినేతగా ఉన్న సీఎం జగన్గత 2016లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ వెయ్యి రోజుల పాలనలో అనేక రకాలైన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 
 
ప్రజలకు మేలు చేయాలన్న మనస్తత్వం, తన మనసులో అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టతకుదరాలి. అడుగుముందుకు వేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. వీటన్నింటినీ తనలో ఇనుమడించుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు