ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరారు. ఆయన విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరారు. ఆయన వెంట వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అంతకుముందే జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసి చర్చించనున్నారు.