కానీ ఆ తరువాత ఆ క్యారెక్టర్ చేయడానికి ఆమె ఒప్పుకోలేదు. రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ క్యారెక్టర్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పని. అందుకే నయనతార అలాంటి క్యారెక్టర్ చేయనని తేల్చి చెప్పేసిందట. అంతేకాదు రాజకీయ నేపథ్యంలో ఉండే సినిమా కాబట్టి ఆ సినిమా అస్సలు వద్దనుకుందట. దీంతో చివరకు రమ్యక్రిష్ణను ఆ క్యారెక్టర్ చేయడానికి దర్శకుడు ఒప్పించారట. తనకు పేరు తెచ్చే క్యారెక్టర్ ముఖ్యమని, అలాంటిది ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతోంది రమ్యక్రిష్ణ.
ఇక జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్‌ను సూర్య చేయనున్నారట. జగన్, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. అందుకే జగన్ క్యారెక్టర్‌ను సినిమాలో చేయడానికి సూర్య ఒప్పుకున్నారట. వై.ఎస్.ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన. కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం లాంటివి ఈ సినిమాలో దర్శకుడు చూపనున్నారట. ఈ సినిమా వై.ఎస్. కుటుంబం గొప్పతనాన్ని, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజినిచ్చే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నాయకులు.