ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఆయన ఎన్నికయ్యారు. పైగా, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం ఇది ఆరోసారి. కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం మంచి వక్త. అటు రాజకీయంగా, ఇటు పాలనపాపరంగా ఎంతో అనుభవం ఉంది.
మరోవైపు, ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే అయిన చిన్న అప్పలనాయుడికి అవకాశం ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. దీంతో స్పీకర్‌గా తమ్మినేనికి అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.