తమిళనాట సంచలనం... 1425 కేజీల బంగారం స్వాధీనం

వరుణ్

సోమవారం, 15 ఏప్రియల్ 2024 (11:34 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో తమిళనాట ఓ కలకలం చెలరేగింది. చెన్నై నగర శివారు ప్రాంతమైన శ్రీపెరుంబుదూర్ - కుండ్రత్తూరు రహదారిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఏకంగా 400 కేజీల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక లారీ నుంచి 1025 కేజీలు, మరో వాహనం నుంచి 400 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే 400 కేజీలకు మాత్రమే సరైన ఆధారాలు ఉన్నాయి. రెండు వాహనాల్లో ఏకంగా 1425 కేజీల బంగారం పట్టుబడటం రాష్ట్రంలో ఇపుడు సంచలనంగా మారింది. ఆ రహదారిలో వచ్చిన ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్‌ను తనిఖీ చేయగా ఈ బంగారం పట్టబడింది. 
 
ఈ సందర్భంగా లారీలో 1000 కేజీల బంగారం, మరో వాహనంలో 400 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం విలువ రూ.700కోట్లకు పైమాటగానే ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలాపట్టుబడిన బంగారంలో కేవలం 400 కేజీలకు మాత్రమే సరైన ఆధారాలు ఉన్నాయి. మిగిలిన 1000 కేజీలకు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూరు సమీపంలోని మన్నూరలోని గోదాముకు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు