స్టాలిన్ కోసం రోడ్డు డివైడర్ దాటి స్వీట్లు కొన్న రాహుల్ గాంధీ - video

ఐవీఆర్

శనివారం, 13 ఏప్రియల్ 2024 (12:58 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం రాహుల్ గాంధీ రోడ్డు డివైడర్ దాటుకుని స్వీటు షాపుకి వెళ్లి స్వీట్లు కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు హోరాహోరీగా సాగుతున్న ప్రచారం మధ్య, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి తమిళనాడులోని సింగనల్లూర్‌లోని స్వీటు షాపులో స్వీట్ డిష్ 'మైసూర్ పాక్'ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం కొన్నారు.
 
ఇపుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. రాహుల్ గాంధీ మిఠాయి దుకాణంలోకి వెళ్లి, ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి 'మైసూర్ పాక్'ని కొన్నారు. అక్కడ స్వీట్ దుకాణంలో పనిచేసేవారి కోరిక మేరకు వారితో గ్రూప్ ఫోటో దిగారు. అందరికీ ధన్యవాదాలు చెప్పి తిరిగి వెళ్లారు. వీడియో చివర్లో, రాహుల్ గాంధీ కోయంబత్తూరులో ఎంకే స్టాలిన్‌ను కలుసుకుని స్వీట్లు ఇచ్చారు. డిఎంకె నాయకుడిని రాహుల్ గాంధీ తన "సోదరుడు" అని సంబోధించారు.
 
“తమిళనాడులో ప్రచారానికి తీపిని జోడిస్తూ - నా సోదరుడు శ్రీ స్టాలిన్ కోసం కొంత మైసూర్ పాక్ కొన్నాను” అని రాహుల్ గాంధీ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ట్వీట్ పైన స్టాలిన్ శనివారం స్పందిస్తూ, జూన్ 4న భారత కూటమి "తీపి విజయం" సాధిస్తుందని పేర్కొన్నారు.

చెన్నై రాహుల్ జీ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం. సడెన్ గా రోడ్డు దాటి స్వీట్ షాపులోకి వెళ్లిన రాహుల్ …. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు బహుకరించేందుకు స్వీట్లు కొన్న రాహుల్ గాంధీ.

ఒక నాడు ఇదే గడ్డపై తండ్రిని కోల్పోయిన రాహుల్ గాంధీ… ప్రేమ మాత్రమే ఈ దేశాన్ని… pic.twitter.com/knCKPMB1Qa

— Revanth Reddy (@revanth_anumula) April 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు