తితిదే సత్రాల్లో సబ్బులు - షాంపూలు ఉచితంగా పంపిణీ!!

బుధవారం, 1 జూన్ 2011 (12:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాల్లో బుధవారం నుంచి ఉచితంగా సబ్బులు, షాంపు, పేస్టు వంటి వాటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అయితే, వెయ్యి రూపాయలకు పైగా అద్దె ఉన్న గదుల్లో బస చేసే భక్తులకు వీటిని అందజేయనున్నారు.

దీనిపై తితిదే కృష్ణారావు మాట్లాడుతూ తితిదే నిర్వహించే నిత్యాన్నదానంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రోటి, పప్పును కూడా అన్నదాన పథకం క్రింద ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇక నిత్యాన్నదానంలో భోజనం చేసే ప్రతి భక్తుడికి రోటీ, పప్పు అందుబాటులో ఉంటుందన్నారు.

పద్మావతి అతిథి భవనంలోని క్యాంటిన్‌లోనూ, ఎస్వీ గెస్టు హౌస్ క్యాంటీన్‌లోనూ ఈ సౌకర్యాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీలు బస చేసే పద్మావతి అతిథి భవనం ప్రాంతంలో ఉన్న అద్దె గదుల్లో బస చేసే భక్తులకు తితిదే ఉచితంగా సబ్బులను అందజేస్తుండేది. అయితే అప్పట్లో సిబ్బంది సబ్బులను సొంత ప్రయోజనాలకు వినియోగించుకోవడంతో ఆ విధానాన్ని రద్దు చేసింది.

వెబ్దునియా పై చదవండి