మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

దేవీ

మంగళవారం, 12 ఆగస్టు 2025 (18:08 IST)
Vijay Deverakonda as McDowell's Soda
హీరోలతో ప్రముఖ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవడం, ప్రచారం చేయడం మామూలే. ఇటీవలే గేమ్ యాప్ కు ప్రచారం చేసి పోలీసు అధికారుల ఎంక్వయిరీకి వెళ్ళి వచ్చిన విజయ్ దేవరకొండ తాజాగా సోడాకు వ్యాపార ప్రచార కర్తగా నిలిచాడు. హౌస్ ఆఫ్ మెక్‌డోవెల్స్ సోడా తన కొత్త వ్యాపారప్రచారకర్తగా నటుడు విజయ్ దేవరకొండను ప్రకటించింది. తాజాగా విజయ్ నటించిన సినిమా కింగ్ డమ్ రిలీజ్ అయింది. మరో రెండు సినిమాలు షూటింగ్ లు జరుగుతున్నాయి.
 
కాగా, ఆయా సినిమాల్లో ఎక్కడో చోట సోడా ప్రచారాన్ని కలిగించేలా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టే ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, వరుణ్ కూరిచ్, వైస్ ప్రెసిడెంట్, పోర్ట్‌ఫోలియో హెడ్ - మార్కెటింగ్, డియాజియో ఇండియా, సాయి మాట్లాడుతూ, హౌస్ ఆఫ్ మెక్‌డోవెల్ సోడా స్నేహాలను జరుపుకోవడం,  అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడం అనే వారసత్వాన్ని నిర్మించింది. చిరస్మరణీయ క్షణాలను మరియు విడదీయరాని బంధాలను సృష్టించే రకం. సంవత్సరాలుగా, బ్రాండ్ దాని ప్రధాన ఉద్దేశ్యానికి కట్టుబడి ఉంటూనే, మారుతున్న సంస్కృతి మరియు వినియోగదారుల ప్రవర్తనతో అభివృద్ధి చెందుతూనే ఉంది. స్నేహ స్ఫూర్తిని సమర్థించడం ప్రత్యేకత అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు