బిల్లు అంత ఈజీగా ఢిల్లీకి వెళ్లదు : పయ్యావుల కేశవ్ వ్యాఖ్య

శనివారం, 14 డిశెంబరు 2013 (14:57 IST)
FILE
తెలంగాణ బిల్లు అంత సులభంగా ఢిల్లీకి వెళ్లదని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ కొన్ని రోజుల వ్యవధిలో పూర్తయ్యేది కాదని, దానికి చాలా సమయం అవసరమని పయ్యావుల చెప్పారు.

బిల్లు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా నేరుగా రాష్ట్రపతి లేదా పార్లమెంటుకు వెళ్లదని... సంబంధిత శాఖలన్నింటి దగ్గరకూ వెళ్తుందని పయ్యావుల తెలిపారు. శనివారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉందని... ఆ పార్టీకి రాష్ట్రాన్ని విభజించే శక్తి లేదని ఎద్దేవా చేశారు. శాసనసభకు బిల్లు వచ్చినంత మాత్రాన, అది చర్చ కోసం వచ్చినట్టు కాదని పయ్యావుల అన్నారు. కచ్చితంగా శాసనసభకు విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి