రాజకీయాల్లో ఒరిజినాలిటీకి నిదర్శనం రాహుల్ గాంధీ : బాబు

గురువారం, 9 ఫిబ్రవరి 2012 (16:15 IST)
File
FILE
రాజకీయాల్లో ఒరిజినాలిటీ ఉండాలని అది లేకుంటే ఎవరూ రాణించలేరని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే నిదర్శనమని ఆయన అన్నారు. కాగా రాహుల్ ప్రధానిని కాలేనని తెలిసే తనకు ఆ పదవిపై మక్కువ లేదంటున్నారని బాబు ఎద్దేవా చేశారు.

సత్తా లేని వారు రాజకీయాల్లో రాణించలేరని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ యూపీఏ సోనియా చేతిలో కీలు బొమ్మ అయ్యారని ఆయన విమర్శించారు. పనిలో పనిగా తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బాబు మండిపడ్డారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. రాసిచ్చిన డైలాగులు చెప్పడం సినిమాలో సులువుగానే ఉంటుంది కాని రాజకీయాల్లో రాణించడం కష్టమని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణకు అన్ని మద్యం దుకాణాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తన కుటుంబానికి గానీ, నందమూరి కుటుంబానికి గాని ఎలాంటి రాజకీయ వారసత్వం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి