పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

సిహెచ్

శనివారం, 11 మే 2024 (21:57 IST)
పైల్స్. తెలుగులో మొలలు వ్యాధి అంటారు. ఈ సమస్య వచ్చినవారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల పైల్స్ సమస్యను నివారించేందుకు ఫైబర్ తక్కువగా ఉన్న అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ఫైబర్ చాలా తక్కువగానూ, అధిక సోడియం కంటెంట్ ఉంటుంది కనుక దీనిని తినరాదు.
తెల్ల రొట్టె, పాస్తా వంటి వాటిని తెల్లటి పిండితో తయారు చేస్తారు కనుక వాటికి దూరంగా ఉండాలి.
పాలు, వెన్న, ఇతర హెవీ క్రీమ్ ఉత్పత్తులకు పైల్స్ సమస్యలున్నవారు దూరంగా ఉండాలి.
వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం, మల విసర్జన సమయంలో ఇబ్బంది కలిగించవచ్చు.
స్నాక్స్ ఉప్పగా ఉండే ఆహారాలకు పైల్స్ ఉన్నవారు దూరంగా వుండాలి
స్పైసీ ఫుడ్స్ తింటే విసర్జన సమయంలో పైల్స్‌తో బాధపడేవారికి నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
పైల్స్ వున్నవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మల విసర్జన బాధాకరమవుతుంది.
టీ, కాఫీల వల్ల మలం గట్టిపడుతుంది, దీనితో విసర్జన చేయడం కష్టతరం చేస్తుంది.
ప్యాక్ చేసిన ఆహారాలు ఆరోగ్యకరమైనవి కావు, పైల్స్ ఉన్న వ్యక్తులు వాటిని ఖచ్చితంగా నివారించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు