వైఎస్ఆర్ కాంగ్రెస్ ఛార్జ్ అయిపోతోంది: తేదేపా నేత బైరెడ్డి

శుక్రవారం, 7 అక్టోబరు 2011 (13:24 IST)
రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాటరీ ఛార్జ్... డీఛార్జ్ అయిపోతోందని కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ అన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పరిశీలకులుగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి పసుపు జెండా భుజాన వేసుకున్నారు.

ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... గతంలో వచ్చిన చిరంజీవి పార్టీ తరహాలోనే ఇపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధమైందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

ఇకపోతే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులుగా వ్యవహరిస్తూ వచ్చినట్టు చెప్పారు. అయితే, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి