కృష్ణమ్మ పరవళ్లు-శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్ల ఎత్తివేత (వీడియో)

సెల్వి

మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:05 IST)
కృష్ణమ్మ నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 
 
స్పిల్ వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా నమోదైంది. 
 
శ్రీశైలం జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జలవిద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు.

శ్రీశైలం అన్ని గేట్లు ఎత్తివేసిన అధికారులు #ChandrababuNaidu #TDPTwitter pic.twitter.com/CoLSFrLzmJ

— ???? (@TEAM_CBN1) August 6, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు