ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఫలితంగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక హాస్టల్‌లో ఉండే విద్యార్థుల్లో 175 మందికి కరోనా వైరస్ సోకింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌కి చెందిన హాస్టల్‌లో ఈ పరిస్థితి ఏర్పడింది.
దీంతో సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్‌ల పరంపర కొనసాగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. మాస్క్ ఉంటేనే ఆయా పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.