స్మగ్లర్లు తెలివిగా రవాణా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు. అయితే శనివారం తెల్లవారుజామున రవాణా చేస్తుండగా, తమ బృందం లారీని అడ్డుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్ ను పట్టుకోగలిగామని, అతనిని విచారించి, స్మగ్లింగ్ కు అసలు కారకులపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
ఊత్తుకోట ప్రాంతాల్లో స్మగ్లర్లు కోసం గాలింపులు చేస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని దుంగలు కూడా అడవిలో ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. వీటిని కొంతమంది స్థానిక స్మగ్లర్లు, తమిళులు కలసి సేకరించి నట్లు తేలిసిందన్నారు.
ఈ సమావేశంలో సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ లు వాసు, సురేష్, వెంకట రవికుమార్ (కోడూరు),ఎఫ్ బి ఓ కోదండ తదితరులు పాల్గొన్నారు.