రూ 4,500 కోట్లతో 30 వేల పనులు: అక్టోబర్ 14వ నుంచి 20 వరకు ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు'

ఐవీఆర్

ఆదివారం, 13 అక్టోబరు 2024 (21:02 IST)
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించిన గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమం ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు. ఈ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా... 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం జరుగనుంది.
 
ఇంకా 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని, 25,000 గోకులాలు, 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు చేపట్టనున్నారు. చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే ధృడ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

#PallePanduga #పల్లెపండుగ

ప్రపంచ రికార్డు సృష్టించిన గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి.

అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమం ద్వారా

- 4,500 కోట్ల నిధులతో చేపట్టబోతున్న 30,000 పనులు.
- 500 కిలోమీటర్ల… pic.twitter.com/foHkutois6

— JanaSena Party (@JanaSenaParty) October 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు