వేయని రింగ్ రోడ్డు కేసులో 420 సీఎం .. నన్ను ఏ14గా చేర్చించారు : నారా లోకేశ్

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (15:22 IST)
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏ14గా సీఐడీ పోలీసులు పేర్కొన్నారు. దీనిపై లోకేశ్ స్పందించారు. అసలు వేయని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 420 సీఎం జగన్మోహన్ రెడ్డి తనను ఏ14గా చేర్పించారని వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 1 తెచ్చినా, యువగణం జనగళమై గర్జించిందన్నారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా యువగళం ఆగదని ఆయన ప్రకటించారు. తాము ప్రకటించినట్టుగానే యువగళం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందన్నారు. 
 
తన తండ్రి చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టారని, ఈ కారణంగా తాను యువగళం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశానని తెలిపారు. ఇపుడు తాను మళ్లీ పాదయాత్రను ప్రారంభిస్తానని ప్రకటించగానే తన శాఖకు సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఈ 420 సీఎం ఏ14గా చేర్పించారని మండిపడ్డారు.
 
రిపేర్ల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేయించారని విమర్శించారు. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగణాన్ని వినిపిస్తుందని, ఇచ్ఛాపురం వరకు నడిపిస్తుందని నారా లోకేశ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు