కడప 1వ డివిజన్ పరిధిలో ఎదురెదురుగా ఉండే గృహాల్లో 9 సంవత్సరాల బాలిక, 16 ఏళ్ల బాలుడు కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, బాలికపై కన్నేసిన బాలుడు.. శనివారం రాత్రి ఇంటి వద్ద పడుకుని నిద్రపోతున్న బాలికను తన ఇంటి మిద్దెపైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో నిద్రలేచిన బాలిక తల్లి.. కుమార్తె కోసం గాలించింది. ఇది చూసిన బాలుడు.. భయపడి ఇంటినుంచి పారిపోయాడు.
మరుసటి రోజు బాలిక కడుపునొప్పి వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా, జరిగిన విషయాన్ని బాలిక వివరించింది. దీనిపై చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వైద్యం కోసం బాలికను రిమ్స్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలబాలికల పేర్లను పోలీసులు వెల్లడించలేదు.