రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పి. రామ కృష్ణారెడ్డి, అధికారులు సి నారాయణ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), కె.నరసింహమూర్తి, ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్ విజయవాడ, పిపిఎంయు, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎ.రాజా స్వరూప్ కుమార్, కెసి డివిజన్, విజెఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎ రాజా స్వరూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.