మల్లెపూలకు ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. పండగలు, పెళ్లిళ్ల సమయంలో డిమాండ్ మరింత పెరుగుతుంది. కరోనా ప్రభావంతో పూల ఎగుమతి నిలిచిపోయింది. కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. లాభాలు వస్తాయని ఆశించిన రైతు తీవ్ర నిరాశకు లోనవుతున్నాడు.
కర్నూలు జిల్లాలో సుమారు 6,250 ఎకరాల్లో మల్లె సాగవుతోంది. రోజూ 20 టన్నుల పూలు ఉత్పత్తి అవుతుంటాయి. ఒక్క చాగలమర్రి నుంచే దాదాపు ఎనిమిది టన్నుల పూలను తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.
దీంతో, పూలను కోయడానికి అయ్యే కూలీల ఖర్చును భరించలేక పూలను రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. సుమారు పది వేల మంది కూలీలకు పని లభించడం లేదు. చాగలమర్రి మండలంలో రోజుకు రూ.లక్ష, కల్లూరు మండలంలో రోజుకు రూ.లక్షన్నర నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.