ప్రేమ కోసం కొందరు యువకులు మృగాళ్లుగా మారిపోతున్నారు. తాము కోరుకున్న అమ్మాయి కాదని చెప్పిందంటే.. వాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారు. కత్తులతో పాటు యాసిడ్‌లతో దాడికి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మందమర్రికి చెందిన మర్రి రామకృష్ణ ప్రేమించిన అమ్మాయి తనను కాదు పొమ్మంది.