అక్కా.. నేను కూడా అటే వెళ్తున్నా... రా, నా బైక్ ఎక్కు అని పొలాల్లోకి తీస్కెళ్లి....

శుక్రవారం, 14 జూన్ 2019 (18:33 IST)
ఒకే గ్రామానికి చెందినవాడు కావడంతో అతడిని నమ్మి అతడి బైకు ఎక్కిందా యువతి. బైకుపై ఎక్కగానే అతడిలో కామాంధుడు మేల్కొన్నాడు. అంతే... తన వాహనాన్ని మెల్లిగా పొలాల్లోకి దారి మళ్లించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కంకిపాడులోని గొడపర్రు గ్రామానికి చెందిన యువతి కంకిపాడులోని ఆసుపత్రిలో నర్సుగా చేస్తోంది. ప్రతిరోజూ డ్యూటీ ముగియగానే ఆటో ఎక్కి వెళ్తుండేది. ఆ రోజు కాస్త పొద్దుపోవడంతో ఆదుర్దాగా ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ఆమె గ్రామానికే చెందిన రవీంద్ర అనే యువకుడు మోటారు బైకుపై వెళుతూ ఆమెను చూసి ఆపాడు. అక్కా... నేను కూడా గొడవర్రుకే వెళ్తున్నా. రా... వచ్చి బైకు ఎక్కు నిన్ను దించుతా అన్నాడు. తన సొంత గ్రామానికి చెందినవాడే కదా అని అతడి బైక్ ఎక్కింది యువతి.
 
కొంతదూరం బాగానే వెళ్లిన అతడు కంకిపాడు లాకుల వద్దకు రాగానే బైకును సర్రుమంటూ పోనిస్తూ దారి మరల్చాడు. దాంతో అనుమానం వచ్చిన యువతి వాహనాన్ని ఆపాలంటూ అరిచింది. అతడు ఆమె మాట వినకుండా పొలాల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె పెద్దగా అరుస్తూ బైకు ఆపుతావా దూకమంటావా అనడంతో.. దూకితే చస్తావ్ అంటూ హెచ్చరించాడు. ఐతే అతడి మాటలు పట్టించుకోకుండా ఆమె వాహనం దూకేసి పెద్దపెద్దగా కేకలు వేసింది. దాంతో స్థానికులు అక్కడికి వచ్చి అతడిని చితక్కొట్టి పోలీసులకి అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు