పిల్లలు లేరని తిరుమలలో చిన్నారిని కిడ్నాప్... ఆ తరువాత?

సోమవారం, 18 మార్చి 2019 (20:22 IST)
పిల్లలు లేకపోవడంతో చిన్నారి వీరాను కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది. కార్వేటినగరం మండలం వండిండ్లు గ్రామానికి చెందిన తులసి, సాయిలకు 2016 సంవత్సరం వివాహమైంది. తులసికి గర్భస్రావమై పిల్లలు పుట్టరని వైద్యులు తెలిపారు. దీంతో ఇద్దరు విడిపోయారు. 
 
ఒంటరిగా ఉన్న తులసి నెలన్నర క్రితం తిరుమలకు వచ్చింది. తిరుమలలో చిన్నారులతో చాలామంది భక్తులు వస్తారు కనుక ఎవరో ఒక చిన్నారిని ఎత్తుకెళ్ళి పెంచుకోవాలనుకుంది. 
 
ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో పనిచేస్తున్న తులసి నిన్న తెల్లవారుజామున తిరుమలలోని ఎస్వీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వీరాను కిడ్నాప్ చేసింది. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. వీరాను క్షేమంగా తల్లిదండ్రులు మావీరన్, కౌసల్యలకు అప్పగించారు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు