డిగ్రీ విద్యలో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతోనే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇకపై అటానమస్ కళాశాలల్లో సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 109 కళాశాలలు అటానమస్ హోదా పొంది సిలబస్ రూపకల్పనతో పాటు సొంతంగా పరీక్షలు నిర్వహించాయని చెప్పారు.