ఆరిలోవ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:29 IST)
ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పై శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.ఓ పాత నిందితుడు వద్ద కేసు మాఫీకు సంబంధించి వ్యవహారంలో ఏడు వేల రూపాయలు లంచం అడిగిన ఎస్ ఐ శ్రీనివాస్రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.

ఓ పాత కేసులో నిందితులైన బొడ్డేపల్లి వైకుంఠ రావు అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో శుక్రవారం ఉదయం పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా శ్రీనివాసరావును పట్టుకున్నారు.

గత కొంతకాలంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితుల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాలంటే నే బాధితులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారని పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఏసీబీ దాడులు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసరావు శైలి ముందు నుంచి కూడా వివాదా స్పదంగా ఉందన్న వాదనలు ఉన్నాయి పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులను భయపెట్టి బెదిరించి సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఎట్టకేలకు శ్రీనివాసరావు పాపం పండింది నిందితుడైన బొడ్డేపల్లి వైకుంఠ రావు నేరుగా ఎసిబి అధికారు లకు సమాచారం ఇచ్చి రెడ్హ్యాండెడ్గా లంచం ఇస్తూ పట్టుబడినట్లు చేశారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరగడంతో ఒక్కసారిగా పోలీసుశాఖ ఉలిక్కి పడింది.

ఈ దాడుల్లో ఎసిబి డిఎస్పీ బివిఎస్ రామన మూర్తి సిఐలు లక్ష్మణమూర్తి, ఎస్ రమేష్,ఎస్ కే గఫుర్, ప్రేమకుమార్ తదరులు పాల్గొన్నారు. ఎస్సై శ్రీనివాస్ ను రిమాండ్కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు