రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' చిత్రం పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సూర్య రెట్రో సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని కల్కి 2898 ఏ డీ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు. మిగతా టెక్నిషియన్స్ విషయంలో సర్ప్రైజెస్ వుంటాయి. మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో రివీల్ చేయబోతున్నారు. మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ రానున్నాయి.