'పవర్' అంటే ఆగ్రహం కాదు.. పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్ (video)

సోమవారం, 4 నవంబరు 2019 (13:48 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. పవర్ అంటే ఆగ్రహం కాదనే అర్థంలో ఆమె ఆ ట్వీట్ చేశారు. దీన్ని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా పూనమ్ కౌర్ విమర్శలు సంధిస్తూనే వున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వైకాపా సర్కారు ఇసుక విధానానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ జరిగింది. ఇందులో పవన్ ఉద్వేగభరింగా ప్రసంగించారు.
 
ఈ నేపథ్యంలోనే పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేశారు. 'ఆగ్రహం అంటే పవర్ కాదు' అని ఆమె పేర్కొంది. దీంతో 'పవర్' స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. 
 
వైసీపీకి ఎప్పుడు అమ్ముడుబోయావు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 'నీకు బుద్ధి ఉంటే ఎవరి గురించి ట్వీట్ చేస్తున్నావో వారి పేర్లను కూడా రాయి' అని ఒక రిప్లై ఇచ్చారు. 'బాగా చెప్పారు మేడం. అయితే, మీ ట్వీట్‌లో తీవ్రత కాస్త తగ్గింది' అని మరొకరు రిప్లై ఇచ్చారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు