వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని సీనియర్ నటి రాశి కలిసింది. అయితే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను కూడా రాశి కలిసింది. అయితే మర్యాదకపూర్వకంగానే కలిశానని.. తన బిడ్డ పుట్టినరోజు ఫంక్షన్‌కు ఆహ్వానించేందుకే పవన్‌ను కలిశానని చెప్పింది. కానీ జగన్‌తో రాశి భేటీపై మాత్రం రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదంటూ రాశి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
రాజకీయాలపై ఎలాంటి ప్రస్తావన రాలేదని చెప్పినా నమ్మబుద్ధి కాలేదని రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటికే వైకాపాలో రోజా, విజయచందర్ ఒకరిద్దరు తప్పితే సినీ నటులు ఎక్కువమంది లేరు. నటదంపతులు రాజశేఖర్, జీవితలు ఆ మధ్య జగన్ వైపు వెళ్లినా.. తర్వాత దూరమైపోయారు. తాజాగా రాశి కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉంటే ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్దంగా ఉండండి.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా ఏకకాలంలో ఎన్నికలే మంచివంటూ ముందస్తు సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2018లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే పార్టీలన్నీ సినీ తారలపై దృష్టి పెట్టాయి. ఇటీవలే హీరో సుమన్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ ప్రకటించేశాడు. పార్టీ పేరు చెప్పకపోయినా రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఖాయమని తేల్చి చెప్పేశాడు.