కరోనా కాలంలో విలక్షణ నటుడు సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచాడు. ఆపదలో వున్నవారిని వారి వారి గమ్య ప్రాంతాలకు చేర్చాడు. తానున్నాననే అభయం ఇస్తున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లా రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ని అందించాడు. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.