సాయంత్రానికల్లా ఓ ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతూ వుంటుంది.. సోనూసూద్

ఆదివారం, 26 జులై 2020 (17:33 IST)
కరోనా కష్టకాలంలో సోనూసూద్ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులనెందరినో.. ఆయన వారి స్వస్థలాలకు పంపించారు. ఇంకా ఎన్నో.. సేవాకార్యక్రమాలు ఆయన నిర్వహించారు. ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే వున్నారు.
 

తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ రైతు కాడెద్దులతో, ట్రాక్టర్‌తో పొలం దున్నించుకునేందుకు డబ్బులేక తన ఇద్దరు కుమార్తెల సాయంతో పొలం దున్నడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వీడియో సోనూసూద్ దృష్టికి చేరింది. ఈ వీడియో చూసిన సోను సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. వారికి ఓ ట్రాక్టర్ కొనివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. తొలుత వారికి ఓ జత ఎద్దులు కొనివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. కానీ ఆపై మనసు మార్చుకుని సోనాలికా ట్రాక్టర్ అందించాలని నిశ్చయించుకున్నారు. సాయంత్రానికల్లా ఓ ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతూ ఉంటుంది అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. సోనూ సేవాకార్యక్రమాలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

 

Spoke with @SonuSood ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams pic.twitter.com/g2z7Ot9dl3

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 26, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు