సెప్టెంబరు మొదటి వారం నుంచి తిరుపతి, తిరుమలలోని కౌంటర్లలో టీటీడీ అగరబత్తీలను విక్రయించనునుంది. నిజానికి ఆగస్టు 15వ తేదీ నుంచే అగరబత్తీలు విక్రయించాలని అధికారులు భావించినా ఏర్పాట్లు పూర్తి కాలేదు. దీంతో సెప్టెంబరుకు వాయిదా వేసుకున్నారు.
దీని గురించి ఈవో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ... బెంగళూరుకు చెందిన దర్శన్ సంస్థ సహకారంతో ఏడు రకాలైన సువాసనలతో అగర బత్తీలను, కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ సంస్థ సహకారంతో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు తెలిపారు.
ధూప్ చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్, ధూప్‌కోన్‌లు, విబూది, హెర్బల్ టూత్ పౌడర్, ఫేస్ ప్యాక్, సోపు, షాంపులు, నాశల్ డ్రాప్స్, గోఆర్క్, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, ఆవుపేడ పిడకలు, ఆవుపేడ సమిదలు తదితరాలను తయారు చేయాలన్నారు.