సెప్టెంబర్ 12న మా అసోసియేషన్‌ ఎన్నికలు..

సోమవారం, 23 ఆగస్టు 2021 (10:46 IST)
తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలకు తేదీ ఖరారైంది. కరోనా పరిస్థితులు లేకపోతే  సెప్టెంబర్ 12న అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని కార్యవర్గ సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు మా అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుతోపాటు పూర్వ అధ్యక్షుడు మురళీమోహన్ , మోహన్ బాబు, శివకృష్ణలతో మా అధ్యక్ష కార్యదర్శులతోపాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఆన్ లైన్ లో సమావేశమయ్యారు.
 
మా అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, గత కార్యవర్గంలో సభ్యుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలపై సుమారు 2 గంటలపాటు చర్చించారు. ప్రస్తుత కార్యవర్గ పదవికాలం ముగియడంతో సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోవాలని కోరారు. ఆగస్టు 22న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. 
 
సెప్టెంబర్ 12న అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కార్యవర్గ సభ్యుల ప్రతిపాదనలపై కృష్ణంరాజు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి జరిగే మా ఎన్నికల్లో ఈసారి  సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తోపాటు యువ కథానాయకుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమ, సీవీఎల్ నర్సింహరావు పోటీపడుతున్న విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు