సంజీవ్ స్టేట్ టీబీ ట్రైనింగ్ సెంటర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహమైంది. సంజీవ్‌కు ప్రతి నెలా సుమారు రూ.70 వేల వరకు వేతనం వస్తోంది.
మద్యానికి అలవాడు పడ్డ ఆయన వచ్చిన వేతనంలో ఎక్కువ భాగం మద్యం కోసం ఖర్చు పెట్టేవాడు. స్నేహితులతో కలిసి విందులు, వినోదాలు చేసుకునేవాడు. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సెలవులు కావడంతో ఇద్దరు పిల్లలు ఆర్‌సీపురంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు.
రాత్రి ఎప్పటి లాగే మద్యంతాగి వచ్చిన భర్తతో గొడవ పడింది. దీంతో సంజీవ్ భార్యను తీవ్రంగా కొట్టాడు. కొడుకు, కూతురుకు ఫోన్ చేసి మీ నాన్న తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తరువాత సంజీవ్.. భార్యను కత్తితో ఛాతిపై పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సంజీవ్‌ను గాలింపు చర్యలు చేపట్టారు.