వీఆర్ఏ భార్యపై వీఆర్వో లైంగిక వేధింపులు..

సోమవారం, 1 జూన్ 2020 (23:03 IST)
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, అలాగే కోర్టులు ఎన్ని చట్టాలు చేస్తున్నప్పటికీ వారి మీద లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. కరీంనగర్‌లో తాజాగా వీఆర్ఏ భార్యపై వీఆర్వో లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గోపాలపురం మండలం, గదుర్శేడ్ గ్రామ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న సదరు అధికారి అతని క్రింద పనిచేసే వీఆర్ఏ భార్యపై కన్నేసాడు.
 
ఆమె భర్తను ఎప్పుడూ ఏదో ఒక పని మీద బయటకు పంపి, ఆ తర్వాత తన ఇంటికి వచ్చి ఆమెను లైంగికంగా వేధించేవాడని బాధితురాలు పేర్కొంది. నిన్న ఒంటరిగా ఉన్న సమయంలో తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని బాధిత మహిళ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. ఈ విషయాన్ని భర్తకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తనతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించి, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు