YS Jagan: జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో.. (వీడియో)

సెల్వి

శనివారం, 21 డిశెంబరు 2024 (13:41 IST)
Allu Arjun_Jagan
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు స్పెషల్ విషెస్ చెబుతున్నారు. మరోవైపు జగన్ బర్త్ డే వేడుకలను ఆయన ఫ్యాన్స్ ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. 
 
గ్రూపులు గ్రూపులుగా బ్యానర్లు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేశారు. 
 
రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారంటూ క్యాఫ్షన్ ఇచ్చి బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్న వేళ ఈ ఫ్లెక్సీ కొత్త తలనొప్పి తప్పదా అన్నట్లు బన్నీ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. 

జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీ లో అల్లు అర్జున్ ఫోటో

మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటో ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేసిన వైసీపీ అభిమానులు

రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరు ఏకం అవుతారంటూ ఫ్లెక్సీ pic.twitter.com/U1XQhdTcCd

— BIG TV Breaking News (@bigtvtelugu) December 21, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు