ముఖ్యంగా, పుష్ప-2 విడుదలైన కేవలం 15 రోజుల్లోనే స్ట్రీ 2 చిత్రం జీవితకాల బాక్సాఫీస్ కలెక్షన్‌ను అధిగమించింది. అదనంగా, ఇది కేవలం 14 రోజుల్లోనే రూ.1,500 కోట్లు దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ముంబై ప్రాంతం నుండి మాత్రమే రూ.200 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది
ఇకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 14 రోజుల్లోనే రూ.1508 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకు కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల రికార్డులను పుష్ప దాటేసింది. ఇంకా పుష్ప 2.. ప్రభాస్ నటించిన బాహుబలి 2 సాధించి రూ.1810 కోట్ల వసూళ్లను దాటే దిశగా దూసుకెళ్తోంది.