రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో ఒక్క పక్కా భవనం కూడా నిర్మించలేదనీ, అవన్నీ గ్రాఫిక్స్ అంటూ విష ప్రచారం చేసిన వైకాపా ప్రభుత్వం ఇపుడు గ్రాఫిక్స్‌ను ఎలా లీజుకు ఇస్తారంటూ రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని అద్దెకు ఎలా ఇస్తారని రైతులు నిలదీస్తున్నారు.
అమరావతి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రూపు-డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవన సముదాయాన్ని లీజుకు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. దీనిపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. అమరావతిని రాజమౌళి సినిమాలోని గ్రాఫిక్స్ అంటూ అవహేళన చేసిన వైకాపా నాయుకులు ఇపుుడ వాటిని అద్దెకు ఎలా ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని ప్రైవేటు సంస్థల కోసం అద్దెకు ఇవ్వాలనుకోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్ముకోవడం, అప్పులు తెచ్చుకోవడం, అద్దెకు ఇచ్చుకోవడం, తనఖా పెట్టడం తప్ప ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి శూన్యమన్నారు.