అమరావతి అపార్టుమెంట్లలో పనులు ప్రారంభం

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (10:32 IST)
నవ్యాంధ్య రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్లుమెంట్లలో మిగిలి పోయిన పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. పాలనా వికేంద్రీకరణ పేరుతో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కారు ఇటీవల వెనక్కి తీసుకుంది. దీంతో ఇపుడు అమరావతిపై దృష్టిసారించింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టుంది. 
 
నిజానికి రాజధాని నిర్మాణం పనులు నిలిపివేసిన సమయానికే ఈ భవాలన నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. కొన్ని భవనాల్లో మాత్రం కాంక్రీట్, టైల్స్, రంగులు వేయడం, ఏసీలు అమర్చడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటివి మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఇపుడు అలా మిగిలిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు. 
 
ఇదిలావుంటే అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోసం 12 టవర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం 6 టవర్లలో అపార్టుమెంట్లను నిర్మించారు. ఈ మొత్తం పనులకు ఒకే ప్యాకేజీగా అప్పట్లో టెండర్లను కూడా ఆహ్వానించగా, ఎన్.సి.సి సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు