నేడు, రేపు కొంచెం చ‌లి త‌గ్గే అవ‌కాశం, పొడి వాతావ‌ర‌ణం!

గురువారం, 23 డిశెంబరు 2021 (12:21 IST)
తెలుగు రాష్ట్రాల‌లో చ‌లి చంపుతోంది. ప‌ట్ట‌ప‌గ‌లే చ‌లికి న‌రాలు కొంక‌ర్లు తిరిగే ప‌రిస్థితి. అయితే, ఇది కాస్తా మారి, నేడు రేపు కొంచెం పొడి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని భారత ప్రభుత్వం అమ‌రావ‌తి వాతావరణ శాఖ తెలిపింది.  
 
 
తక్కువ ఎత్తులో ఉత్తర  గాలులు  ఉత్తరాంధ్రలో, తూర్పు గాలులు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో      వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంల‌లో ఈ రోజు రేపు, ఎల్లుండి పొడి వాతావరణం వుండే అవకాశం ఉంది. 
కనిష్ట  ఉష్ణో గ్రతలు, సగటు ఉష్ణో గ్రతల కంటే  2 నుండి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తక్కువ ఎత్తులో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల రావచ్చు.
 
 
దక్షిణ  కోస్తా ఆంధ్రలో ఈ రోజు రేపు, ఎల్లుండి పొడి వాతావరణం వుండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణో గ్రతల కంటే  2 నుండి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తక్కువ ఎత్తులో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల రావచ్చును.
 
 
రాయలసీమలో ఈ రోజు రేపు మరియు ఎల్లుండి  పొడి వాతావరణం   వుండే అవకాశం ఉంది.
కనిష్ట  ఉష్ణో గ్రతలు, సగటు ఉష్ణో గ్రతల కంటే  2 నుండి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంద‌ని  అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు