నెల్లూరులో మనుషులను పోలిన పక్షులు (వీడియో)

శనివారం, 18 నవంబరు 2017 (17:54 IST)
ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట పరిసర ప్రాంత వాసులంతా ప్రతి ఏటా విదేశాల నుండి విడిదికి వచ్చే రకరకాల జాతుల పక్షులను చూస్తుంటారు. అయితే గత మూడురోజులుగా ఆ ప్రాంతంలోని కొన్ని పక్షులను చూసి ఈ ప్రాంత వాసులు ఆశ్చర్య పోతున్నారు. పక్షుల్లోనే కొత్త జాతిగా కనిపించడమే కాకుండా గద్ద పోలికలు ఉండడంతో పర్యాటకులు ఎంతో ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. 

మొదట్లో రెండు పక్షులు మాత్రమే కనిపించగా ఇప్పుడు పదుల సంఖ్యలో ఇలాంటి పక్షులే ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. తెల్ల రంగు గుడ్లగూబ మూతిని పోలి ఉన్న ఈ రెండు తెల్లటి పక్షులు ఏ జాతికి చెందినవో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. 
 
వెరైటీ శబ్దంతో పక్షులు సూళ్ళూరుపేట పరిసర ప్రాంతంలో తిరుగుతున్నాయి. వాటిని తరిమి కొట్టినా అక్కడి నుంచి అస్సలు కదలడం లేదు... మెదలడం లేదు. ఎవరికీ అస్సలు భయపడటం లేదు. ఈ పక్షుల విషయం నేషనల్ జియో ఛానల్ వారికి తెలిసింది. విదేశాల నుంచి ఈ పక్షుల షూటింగ్ కోసం వారు మరో రెండు రోజుల్లో సూళ్లూరుపేటకు రానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు