తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా తనయుడు జైషా

సెల్వి

శనివారం, 25 మే 2024 (16:58 IST)
Jay Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఇవాళ‌ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. జై షా వెంట ఆయన తల్లి సోనాల్ షా కూడా ఉన్నారు. 
 
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేసిన జై షాకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. స్వామి వారి దర్శనం తర్వాత సంప్రదాయబద్ధంగా ఆయనకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.  
 
ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా మాత్రమే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు కూడా జైషా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు