అమరావతి రాజధాని కోసం గత రెండేళ్లుగా దీక్ష చేస్తున్న రైతులు తుళ్లూరు నుంచి తిరుమలకు 45 రోజుల పాటు మహాపాద యాత్ర చేయనున్నారు. ఇందుకోసం జనసేన మద్దతు కోరుతూ రైతులు జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌ను కలిసారు. ఈ పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. తమ మద్దతు రైతులకు వుంటుందనీ, పాదయాత్ర విజయవంతం కావాలని నాదెండ్ల ఆకాంక్షించారు.