సెల్ ఫోన్ మాయాజాలంలో యువత పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. సెల్ ఫోన్ లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి చాలామంది ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒక భాగం సెల్ ఫోన్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్స్‌తో నిత్యం చాట్ చేస్తూ సెల్ ఫోన్‌కే కుమారుడు అతుక్కుపోతుండటంతో అతడిని మందలించాడు ఓ తండ్రి. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు.
విజయవాడలోని పాయవరావుపేటలో నివాసముంటున్న గోపీనాథ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో ఫోన్లో నిత్యం చాట్ చేస్తూ ఉండేవాడు. వాట్సాప్, ఫేస్ బుక్‌లతోనే ఎప్పుడూ పని. దీంతో కుమారుడిని మందలించాడు రంగ.