వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిపడ్డారు. ఆదివారం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సమాధి అయిపోయే పరిస్థితిలో జగన్ అంతిమ పోరాటం చేస్తున్నారన్నారు.
అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన జగన్ నారా లోకేశ్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. నదిలో కొట్టుకుపోతున్న నావను నావికుడు ఏ విధంగా రక్షిస్తాడో ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. రేపటి తరం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.