అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటనపై నిందితుల నిర్భయ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
కాగా, బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అడ్డుకుని, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తల్లిదండ్రులు బాలిక కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారని బాధితురాలు విలపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.