కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థినితో ప్రాక్టికల్స్ చేసిన లెక్చరర్...
గురువారం, 8 నవంబరు 2018 (10:40 IST)
జిల్లా కేంద్రమైన అనంతపురంలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ కెమిస్ట్రీ లెక్చరర్ కీచకుడిగా మారిపోయాడు. కెమిస్ట్రీ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ పేరుతో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అనంతపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని కెమెస్ట్రీ లెక్చరర్ కిరణ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. సూటిపోటి మాటలు మాట్లాడుతుండటంతో రెండు నెలలుగా కళాశాలకు పోవడమే మానేసింది.
కారణాలు ఆరా తీస్తున్నప్పటికీ విద్యార్థిని బయటకు చెప్పకపోవడంతో తల్లిదండ్రులు బతిమలాడుతూ వచ్చారు. సోమవారం గట్టిగా మందలించడంతో జరిగిన విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేసింది. రోజూ సెల్‌కు ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్‌లో కూడా మేసేజ్ చేయాలని వేధిస్తున్నట్లు వాపోయింది.
దీంతో బాధితురాలి తండ్రి మంగళవారం ఉదయం ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు కీచక్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.