Rashmika Mandanna, Ayushmann Khurrana and producers
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా థామా. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.